Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, ఫాలోవర్లు, సెలబ్రిటీలు, కోస్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పుట్టినరోజు కూడా తగ్గేదేలే అంటూ షూట్లో బిజీ అయ్యాడు తలైవా. కాగా తలైవా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం కూలీ (Coolie). షూటింగ్ దశలో ఉంది.
ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూలీ కొత్త షెడ్యూల్ షురూ అయింది. ఈ షెడ్యూల్లో అమీర్ ఖాన్, ఉపేంద్ర, తలైవా, రెబా మోనికా జాన్ పాల్గొంటున్నారు. ప్రస్తుతం సంబార్ లేక్ ప్రాంతంలో షూటింగ్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జైపూర్‌లో 10 రోజులపాటు అమీర్ ఖాన్, తలైవా అండ్ టీంపై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుండగా.. ఈ నెలాఖరు కల్లా కూలీ షూటింగ్ పూర్తి చేయనున్నారని ఇన్సైడ్ టాక్. కూలీ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్న్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
షూట్ లొకేషన్ విజువల్స్..
#AamirKhan & #Upendra spotted together on the sets of #LokeshKanagaraj’s #Coolie!🌟🔥 pic.twitter.com/AeG9H0Nwow
— Kollywood Now (@kollywoodnow) December 12, 2024
Coolie Movie Some BTS in Sambhar Lake, Jaipur Rajasthan.
Directed by Lokesh Kanagaraj.#coolie #Rajinikanth #AamirKhan #Upendra #LokeshKanagaraj #Rajasthan #shooting #sambharlake #Jaipur pic.twitter.com/yA0LwOXhn6
— filmybanda (@in_videos13712) December 12, 2024
Akhanda 2 | అఖండ 2 వచ్చేది అప్పుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ టీం రిలీజ్ డేట్ ప్రోమో
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్