The Rise Of Ashoka | కన్నడ యాక్టర్, లూసియా ఫేం సతీశ్ నినాసం లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ది రైజ్ ఆఫ్ అశోక (The Rise Of Ashoka). వినోద్ వి ధోండలే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కాంతార భామ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీ నుంచి వినరా మాదేవ సాంగ్‌ను విడుదల చేశారు. జాతర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట శివుడి గొప్పదనాన్ని మరోసారి ఆవిష్కరించే నేపథ్యంలో ఉండబోతున్నట్టు చెబుతోంది. వినరా మాదేవ పాటను హీరో సతీశ్ నినాసం, సాద్విని కొప్ప, సిద్దుతో కలిసి పాడటం విశేషం. సాంగ్‌లో విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రాన్ని వృద్ధి క్రియేషన్, సతీశ్ పిక్చర్ హౌస్ బ్యానర్లపై వర్దన్ హరి, జైష్ణవి, సతీశ్ నినాసం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
#TheRiseOfAshoka ~ #VinaraMadeva
One voice can spark a revolution ❤🔥🙏https://t.co/f9HlHx4FcK… pic.twitter.com/Y6zsa7labr— Mohan Kumar (@ursmohan_kumar) November 26, 2025
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం