Raju Weds Rambai Trailer | సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు మంచి సందేశాన్నిచ్చిచ్చే చాలా ప్రేమకథలు వచ్చాయని తెలిసిందే. అదే జోనర్లో వస్తున్న ప్రాజెక్ట్ రాజు Weds రాంబాయి. సాయిలు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్వి (కమిటీ కుర్రోళ్లు ఫేం) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈటీవీ ఒరిజినల్ మూవీగా వస్తోన్న ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
హీరో క్యారెక్టర్ బ్యాండ్ బాజా మోగించే సీన్లతో మొదలైంది ట్రైలర్.. ఇక రాజు నువ్వెప్పుడు బ్యాండ్ కొడుతూనే ఉండు. మనకు పెళ్లైనా.. పిల్లలు పుట్టినా.. మనం ముసలోళ్లమైనా బ్యాండ్ కొడుతనే ఉండు సరే నా అంటూ హీరోయిన్ చెబుతున్న సాగుతున్న డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి.
ఊళ్లో బ్యాండ్ కొట్టి జీవనం సాగించే రాజు అనే యువకుడికి చదువుకునే రాంబాయి అనే యువతికి మధ్య లవ్ ట్రాక్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ప్రేమ, పెళ్లి.. వాటి ద్వారా ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ యూత్‌ను ఆలోచింపజేసేలా సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ ద్వారా తెలిసిపోతుంది. ఈ చిత్రానికి విరాటపర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Their hearts beat as one, their love faces every storm ❤️🔥
Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️
Launched by The Star of New Age Films @AdiviSesh garu💫
A @sureshbobbili9 musical… pic.twitter.com/hnOzirHYxj
— BA Raju’s Team (@baraju_SuperHit) November 13, 2025
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ