Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ
Ram Gopal Varma | ‘చికిరి చికిరి’ సాంగ్‌లో రాంచరణ్ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాంచరణ్ వేసిన మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం విడుదలైన ఈ సాంగ్ 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి నయా రికార్డు నెలకొల్పింది.
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్స్ వస్తున్నాయంటే ఎప్పుడు ఎవరిపై సెటైరికల్‌గా ఉంటాయో చెప్పడం కష్టమే. అయితే అప్పుడప్పుడు పాజిటివ్ వైబ్ అందించే ట్వీట్స్ చేస్తూ నెటిజన్లలో జోష్ నింపుతుంటాడు. తాజాగా అలాంటి ట్వీటే ఒకటి చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఇంతకీ వర్మ ఈ సారి చేసిన ట్వీట్ ఏంటనే కదా మీ డౌటు. కొన్ని రోజులుగా నెట్టింటిని షేక్ చేస్తున్న పెద్ది చికిరి చికిరి సాంగ్‌పై ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ.
సినిమాలోని ప్రతీ క్రాఫ్ట్ కేవలం హీరోను ఎలివేట్ చేసేలా మాత్రమే ఉండాలన్న వర్మ.. ఈ పాటలో రాంచరణ్ రా లుక్‌లో నిజంగా పేల్చేశాడంటూ కితాబిచ్చాడు. సినిమాలోని ప్రతీ క్రాఫ్ట్ అంటే డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీతోపాటు మిగిలిన క్రాఫ్ట్స్ ముఖ్య ఉద్దేశం కేవలం హీరోను ఎలివేట్ చేయడమేనని.. చాలా కాలం తర్వాత పెద్ది సాంగ్‌లో రాంచరణ్లోని నిజమైన గ్రేస్‌ను చూశా.. బుచ్చిబాబు సాన టీంకు అభినందనలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు వర్మ. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘చికిరి చికిరి’ సాంగ్‌లో రాంచరణ్ ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రాంచరణ్ వేసిన మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుక్రవారం విడుదలైన ఈ సాంగ్ 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నయా రికార్డు నెలకొల్పింది. కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ కూడా సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ కంపోజిషన్‌లో మోహిత్ చౌహాన్ పాడిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
The true purpose of every craft in cinema, be it direction, music, cinematography etc should be only to elevate the HERO.
After a long time, I saw @AlwaysRamCharan in his most raw, real, and explosive form in the #peddi song Chikiri Chikiri
Hey @BuchiBabuSena kudos to you for…— Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2025
Read Also :
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

