Kaantha | మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ కాంత (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది దుల్కర్ సల్మాన్ టీం.
కాంతను ముందుగా లక్కీభాస్కర్తోపాటు షూట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ లుక్ టెస్ట్ పూర్తి చేసినప్పుడు ఇద్దరు డైరెక్టర్లు అక్కడే ఉన్నారు. ఇద్దరు డైరెక్టర్ల టీమ్స్ కూడా రెండు లుక్స్‌లో ఉన్న కామన్ థింగ్‌ను కనుగొనేందుకు ప్రయత్నించాయి. కాంతలో 80స్ పీరియాడిక్ లుక్‌లో మారిపోవాల్సి ఉంటుంది. మీరు ఈ రెండు లుక్స్ కూడా సరిపోల్చుకోవచ్చు. కాంతలో క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించాల్సి రావడంతో అది సాధ్యం కాలేదు. కాంత ప్రొడక్షన్స్ పనుల్లో ఆలస్యం కూడా దీనికి ఒక కారణమంటూ చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.
ఇండియన్ యాక్టర్, సినిమాటిక్ సింగర్‌గా పాపులర్ అయిన ఎంకే త్యాగరాజ భగవతార్ ప్రయాణం స్పూర్తిగా సాగే ఫిక్షనల్ క్రైం డ్రామా అని అన్నాడు దుల్కర్ సల్మాన్. అంతేకాదు కాంత సాధారణ పీరియాడిక్ డ్రామా కాదని.. మోడ్రన్ సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని చెప్పారు రానా, దుల్కర్ సల్మాన్.
ఇప్పటికే కాంత మూవీ నుంచి చేసిన అమ్మాడివే సాంగ్, రేజ్ ఆఫ్ కాంత (Rage Of Kaantha) ట్రాక్ సినిమాలపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. కాంత సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Suma | పాడ్‌కాస్ట్‌లో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సుమ.. కలిసి కనిపించిన విడిపోలేదా అనే వారు