Veera Dheera Sooran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Vikram) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి వీరధీరసూరన్ (VeeraDheeraSooran). ఛియాన్ 62 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీకి చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎక్జయిటింగ్ అప్డేట్ అందించబోతున్నారంటూ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రియా ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుదల తేదీయే అయి ఉంటుందని అంతా చర్చించుకుంటుండగా.. దీనిపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది. క్యూట్ క్యూట్‌గా సాగుతున్న రియా సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన వీరధీరసూరన్ టైటిల్ టీజర్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు తెలియజేస్తుంది.
ఈ చిత్రాన్ని ఏపీలో శ్రీలక్ష్మి మూవీస్, తెలంగాణలో ఎన్వీఆర్ బ్యానర్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Today 06 .00 PM #VeeraDheeraSooran Interesting Update @riyashibu_ Mam Cute Video 🖤✨ @chiyaan @shibuthameens #ChiyaanVikram pic.twitter.com/gzFbMNq6dw
— சாமி 🦁⚡ (@ChiyanSaamy) January 22, 2025
#VeeraDheeraSooran something big brewing today evening 6 PM! pic.twitter.com/eASk0xB7Ur
— Sreedhar Pillai (@sri50) January 22, 2025
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?