Alcoholia Video Song | తెలుగు ప్రేక్షకుల్లో అత్యధిక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న బాలీవుడ్ హీరోలలో హృతిక్‌రోషన్ ఒకడు. ‘క్రిష్’ సిరీష్, ‘ధూమ్-2’, ‘జోదా అక్బర్’ వంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రాల తర్వాత ఈయన నటించిన హిందీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూడటం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈయన నటించిన ‘విక్రమ్ వేద’ విడుదలకు సిద్ధంగా ఉంది. సైఫ్ అలీఖాన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన పుష్కర్- గాయత్రి హందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌సింగిల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘అల్కొహోలియా’ అంటూ సాగే మాస్ బీట్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో హృతిక్ సిగ్నేచర్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత ఇలాంటి సాంగ్ రావడంతో హృతిక్ ఫ్యాన్స్‌కు కన్నుల పండగలా ఉంది. ఇక హృతిక్ రోషన్ ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడని అందరికి తెలిసిన విషయమే. అలాంటిది ఈయనకు ఇలాంటి మాస్ బీట్ సాంగ్ ఇస్తే చెలరేగిపోతాడు. ఈ పాటను విశాల్ అండ్ శేఖర్ స్వర పరుచగా మనోజ్ ముంతాషిర్ రచించాడు. స్నిగ్దజిత్ బౌమిక్తో కలిసి విశాల్, శేఖర్ ఆలపించారు.
విక్రమ్, భేతాలుడు కథలను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో హృతిక్ వేద పాత్రలో గ్యాంగ్‌స్టార్‌గా నటించగా.. సైఫ్ ఆలీఖాన్ విక్రమ్ పాత్రలో పోలీస్ ఆఫిసర్‌గా నటించాడు. ఈ రీమేక్ చిత్రాన్ని గ్రాండియర్‌గా దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్‌కు జోడీగా రాధికా ఆప్టే నటించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.
Read Also:
Kabza Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కబ్జా’ టీజర్.. ‘కేజీఎఫ్’ను మించేలా ఉందిగా..!
Captain Miller | ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లో టాలీవుడ్ యంగ్ హీరో?
Varun Tej | ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్.. ఆసక్తి రేకిత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ వీడియో