Top Gear Movie First Look Motion Poster | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. ఆందులో ‘టాప్ గేర్’ ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. చేతిలో నుండి బ్యాగులు మారడం, ఆపై కాల్పులు జరగడం. ఆ తర్వాత ఆది కార్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా వెళ్ళడం. అంతలో ఎవరో కారు అద్దాన్ని షూట్ చేయడం వంటివి మోషన్ పోస్టర్లో కనిపించాయి. మోషన్ పోస్టర్‌తోనే సినిమాపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో ఆది క్యాబ్ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్, శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కే.వి శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఆదికి జోడీగా రియా సుమన్ హీరోయిన్గా నటిస్తుంది. బ్రహ్మాజి కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
Presenting the First Look Of #TOPGEAR 🚗@adityamovies & Entertainments Presents #SriDhanaLakshmiProductions@IRiyaSuman #SatyamRajesh #Shashikanth #SridharReddyKV #GiridharMamdipally #SaiSreeram #PrawinPudi @adityamusic pic.twitter.com/5d7lk6Uwty
— Aadi Saikumar (@iamaadisaikumar) September 17, 2022
Read Also:
Kabza Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కబ్జా’ టీజర్.. ‘కేజీఎఫ్’ను మించేలా ఉందిగా..!
Tamannaah | మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్ల దాడి.. వైరల్ అవుతున్న వీడియో
Captain Miller | ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లో టాలీవుడ్ యంగ్ హీరో?
Varun Tej | ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్.. ఆసక్తి రేకిత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ వీడియో