Kabza Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కబ్జా’ టీజర్.. ‘కేజీఎఫ్’ను మించేలా ఉందిగా..!
Kabza Movie Teaser | ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. కన్నడ సినిమాలను తక్కువగా చూసేవారు. ఈ క్రమంలో 'కేజీఎఫ్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది.
Kabza Movie Teaser | ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. కన్నడ సినిమాలను తక్కువగా చూసేవారు. ఈ క్రమంలో ‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది. ఇక అప్పటి నుండి కన్నడ సినిమాలను విపరీతమైన ఆదరణ పెరిగింది. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినిమాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతున్నారు. ఇటీవలే విడుదలైన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోన’ కూడా పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో మరో కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమైంది. కన్నడ స్టార్లు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జా’. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్లో విజువల్స్ గాని, సెట్టింగ్స్ గాని కేజీఎఫ్ రేంజ్లో ఉన్నాయి. ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌పై పోటా పోటిగా నటించడంతో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. మళ్లి కేజీఎఫ్ లాంటి హై యాక్షన్ సినిమాను కన్నడ నుండి చూడబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. రవిబస్రూర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా కథ 1947 నుండి 1984 మధ్య జరుగుందట. అనుకోని పరిస్థితుల్లో ఓ స్వాతంత్ర సమరయోధుడి కొడుకు మాఫీయా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అని కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రియాశరణ్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఏకంగా 7 భాషల్లో విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠి, బెంగాళీ భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా ఏడు భాషల్లో విడుదలవుతున్న మొదటి కన్నడ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

