Varun Tej Next Movie | ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ బిగినింగ్ నుండి విభిన్న తరహా సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఈ ఏడాది ‘గని’తో ఆశించిన స్థాయి ప్రారంభం రాకపోయినా, ఆ తర్వాత ‘ఎఫ్-3’తో మంచి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈయన ప్రవీణ్ సత్తారుతో సినిమా చేయనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నాగబాబు సహా ప్రొడ్యూసర్‌గా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే వరుణ్ తాజాగా మెగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
వరుణ్‌తేజ్ తన 13వ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఈ వీడియోలో వరుణ్ తేజ్ క్యూరియాసిటీతో స్క్రిప్ట్ చదువుతూ చివరి వరకు వస్తాడు. చివర్లో జై హింద్ అని ఉండటంతో.. అక్కడ చిన్న చిరునవ్వుతో స్క్రిప్ట్‌ను క్లోజ్ చేసి దానిపై జెట్‌ను పెడతాడు. ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఫుల్ డిటేయిల్స్ సెప్టెంబర్ 19న ప్రకటించనున్నట్లు ఆ వీడియోలో వెల్లడించారు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ ఎయిర్ వింగ్ కమాండర్‌గా కనింపిచనున్నట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. ‘ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ’ అంటూ వరుణ్ తేజ్ ఈ వీడియోను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు
Touch the sky with Glory!🇮🇳#VT13 pic.twitter.com/FJ12cm40gR
— Varun Tej Konidela (@IAmVarunTej) September 17, 2022