Tamannaah | మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్ల దాడి.. వైరల్ అవుతున్న వీడియో
Tamannaah Bouncers Attacked | దక్షిణాదిన అగ్ర కథానాయికగా పేరు పొందిన నటి తమన్నా. నవతరం హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈమె నటించిన 'బబ్లీ బౌన్సర్' విడుదలకు సిద్ధంగా ఉంది.
Tamannaah Bouncers Attacked | దక్షిణాదిన అగ్ర కథానాయికగా పేరు పొందిన నటి తమన్నా. నవతరం హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈమె నటించిన ‘బబ్లీ బౌన్సర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 23 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడీయోస్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. అయితే ఈ ప్రెస్‌మీట్ అనంతరం తమన్నా బౌన్సర్లు తెలుగు సినీ జర్నలిస్టులపై దాడి చేశారు.
‘బబ్లీ బౌన్సర్’ మీడియా సమావేశానికి తమన్నాతో పాటు దర్శకుడు మధుర్ బండార్కర్ హాజరయ్యాడు. మీడియాతో ఇంటరాక్షన్ పూర్తయిన తర్వాత తమన్నా ఫోటోలు, వీడియోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దాంతో తమన్నా బౌన్సర్లు ఆగ్రహంతో మీడియాపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరూ కెమెరా మ్యాన్స్ గాయపడ్డారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధులు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ డోర్స్ని బౌన్సర్లు క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Senseless overaction by #Tamannaah’s bodyguards.
They attacked two Telugu media people at #BabliBouncer media meet in Hyd today. All after media asked to click pictures of Tamannaah.@tamannaahspeaks pic.twitter.com/wtljI5kQwM
— Daily Culture (@DailyCultureYT) September 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

