Captain Miller | ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లో టాలీవుడ్ యంగ్ హీరో?
Dhanush's Captain Miller Movie | 'తిరు'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్ ఆదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'నానే వరువెన్' విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'నేను వస్తున్నా' పేరుతో తెలుగులో విడుదల కానుంది.
Dhanush’s Captain Miller Movie | ‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్ ఆదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘నానే వరువెన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వా రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘నేను వస్తున్నా’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. దీనితో పాటుగా ద్విభాషా చిత్రం ‘సర్’లో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ రెండు చిత్రాలు సెట్స్ పైన ఉండగానే.. ఇటీవలే ‘కెప్టెన్ మిల్లర్’ అనే పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. హీరోకు సమానంగా సందీప్ కిషన్ పాత్ర ఉండనుందట. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీగా దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందట. అంతేకాకుండా 1930-40 టైం పీరియడ్‌లో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. జీ. వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్య జోతి బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.
Read Also:
Varun Tej | ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్.. ఆసక్తి రేకిత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ వీడియో
నాగార్జునతో నటించను అంటున్న అక్కినేని అమల.. కారణమేంటంటే..
Project-k Movie | ‘ప్రాజెక్ట్-K’ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు?
Samantha | సమంత ఆ అరుదైన రికార్డును క్రియేట్ చేసిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

