Samantha | సమంత ఆ అరుదైన రికార్డును క్రియేట్ చేసిందా?
Samantha Records | దశాబ్ధ కాలానికి పైగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న నటి సమంత. తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయకులతో సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం హిందీలోనూ పలు ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది.
Samantha Records | ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఆ తర్వాత వరుస సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్ట్‌లతో మరింత బిజీగా మారిపోయింది. ఉత్తరాదిన కూడా పలు సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సమంత టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం ఈమె మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే సమంత ఓ అరుదైన ఘనతను సాధించిన విషయం తెలుసా
సౌత్‌లో సమంత ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఎక్కువ 100 కోట్ల గ్రాస్ ఉన్న హీరోయిన్గా సమంత ఓ రికార్డును క్రియేట్ చేసింది. దూకుడు, అత్తారింటికి దారేది, కత్తి, తేరి, 24, జనతాగ్యారేజ్, మెర్సల్, రంగస్థలం వంటి వంద కోట్ల గ్రాసర్ సినిమాలలో సమంతనే హీరోయిన్గా నటించింది. ఈ అరుదైన రికార్డు ఇప్పటివరకు మరో హీరోయిన్ బ్రేక్ చేయలేదు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న మూడు సినిమాల్లో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరోకటి ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న యశోదా. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also:
Yash | ఆ జానర్లో యష్ నెక్స్ట్ చిత్రం ఉండనుందా.. ఈ సారి ‘కేజీఎఫ్’ రికార్డులు అవుటే..!
Trivikram | తివిక్రమ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..?
RRR Movie | ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడు కేటగిరిల్లో నామినేషన్స్?
Bigg Boss 6 Telugu TRP | బిగ్ బాస్ సీజన్ 6 ఇంట్రో ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్ ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

