Yash | ఆ జానర్లో యష్ నెక్స్ట్ చిత్రం ఉండనుందా.. ఈ సారి ‘కేజీఎఫ్’ రికార్డులు అవుటే..!
Rocking Star Yash Next Movie | ఒకప్పుడు కన్నడ హీరోలంటే ఉపేంద్ర ఒక్కడే తెలిసేవాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు 'ఈగ'తో కిచ్చా సుదీప్ పరిచయమయ్యాడు. అయితే ఈ ఇద్దరూ కేవలం సౌత్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇక నార్త్‌లో హీరోల సంగతి అటుంచు.. అసలు కన్నడ ఇండస్ట్రీ అనేది ఒకటుందనే చాలా మందికి తెలియదు.
Rocking Star Yash Next Movie | ఒకప్పుడు కన్నడ హీరోలంటే ఉపేంద్ర ఒక్కడే తెలిసేవాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు ‘ఈగ’తో కిచ్చా సుదీప్ పరిచయమయ్యాడు. అయితే ఈ ఇద్దరూ కేవలం సౌత్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇక నార్త్‌లో హీరోల సంగతి అటుంచు.. అసలు కన్నడ ఇండస్ట్రీ అనేది ఒకటుందనే చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ‘కేజీఎఫ్’తో చరిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్‌తో కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా బాలీవుడ్లో ఖాన్, కపూర్లను సైతం వెనక్కినెట్టి కలెక్షన్లలో యష్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఈ చిత్రం తర్వాత యష్ ఎలాంటి కథతో రాబోతున్నాడు అని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా యష్ నెక్స్ట్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
యష్ నెక్స్ట్ చిత్రాన్ని ‘మఫ్టీ’ ఫేం నార్తన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్రబృందం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. కాగా ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందట. అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌గా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుందట. ఇప్పటికే రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించాడట. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించనుందని టాక్. కేజీఎఫ్ చిత్రం కూడా పీరియాడిక్ యాక్షన్ జానర్లో తెరకెక్కిన విషయం తెలిసిందే.
‘కేజీఎఫ్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో యష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.1250 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

