Project-k Movie | ‘ప్రాజెక్ట్-K’ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు?
Project-k Movie Action Directors | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. 'సాహో', 'రాధేశ్యామ్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ప్రభాస్ ఓ భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
Project-k Movie Action Directors | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ప్రభాస్ ఓ భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అయితే ఇటీవలే కొందరు నెటీజన్లు ఈ సినిమా కథ, ‘ఓకే ఒక జీవితం’ కథకు సిమిలర్‌గా ఉంటుంది అని కామెంట్స్ చేశారు. దానికీ నాగ్ అశ్విన్ తన దైన స్టైల్లో కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్లో ఈ సినిమా జరుగుతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో 5 మేజర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఇక ఈ ఐదు యాక్షన్ సీన్స్ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను మేకర్స్ తీసుకున్నారట. త్వరలోనే యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ లేదంటే 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నాడట. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘తన్హాజీ’ ఫేం ఓ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. దీనితో పాటుగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రాన్ని చేస్తున్నాడు.
Read Also:
రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
RRR Movie | ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడు కేటగిరిల్లో నామినేషన్స్?
Trivikram | తివిక్రమ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి..?
Samantha | సమంత ఆ అరుదైన రికార్డును క్రియేట్ చేసిందా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

