రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review | దసరా ముందు తెరపై సందడి చేసేందుకు వచ్చిన సినిమా "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి".
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review | దసరా ముందు తెరపై సందడి చేసేందుకు వచ్చిన సినిమా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన ఈ సినిమా క్లాస్ సెక్షన్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శుక్రవారం ( సెప్టెంబర్ 16 ) న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
కమర్షియల్ సినిమాలతో సక్సెస్ మీదున్న దర్శకుడు నవీన్ (సుధీర్ బాబు). ఇండస్ట్రీకి కావాల్సిన మాస్ మసాలా సినిమాలు రూపొందిస్తూ పేరు తెచ్చుకుంటాడు. కోరుకున్నంత డబ్బు, కావాల్సినన్ని ఆస్తులు సంపాదిస్తాడు. యువరాణి లాంటి అమ్మాయి నేపథ్యంగా తన కొత్త సినిమా ప్లాన్ చేస్తాడు. కథ కోసం వెతుకుతున్న సమయంలో అతనికి ఓ రీల్ దొరుకుతుంది. దాన్ని ప్లే చేసి చూస్తే అందులో అందమైన అమ్మాయి వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలోని అమ్మాయిని చూసి ఆకర్షితుడు అవుతాడు నవీన్. ఆమెనే వెతికి తన కొత్త సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటాడు. తను వెతికే అమ్మాయి డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి) అని తెలుస్తుంది. సినిమాలో నటించేందుకు ఒప్పిద్దామంటే ఆమెకు, ఆమె కుటుంబానికి సినిమాలంటే ఇష్టం లేదని చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్ సినిమా పట్టాలెక్కిందా? అలేఖ్య నటించేందుకు ఒప్పుకుందా? ఆమెకు, ఆమె కుటుంబానికి సినిమాలంటే అంత ద్వేషం ఎందుకు ఏర్పడింది? అనేది తెరపై చూడాలి.
ఫ్లస్ పాయింట్స్
➕ సుధీర్ బాబు, కృతి శెట్టి నటన
➕ వెన్నెల కిషోర్ కామెడీ
➕ ప్లెజంట్ మేకింగ్
మైనస్ పాయింట్స్
➖ ఊహకందే కథనం
➖ సాగతీత సన్నివేశాలు

ఎలా ఉందంటే
ఆడపిల్లల కలల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. వాళ్లను చదివించడం, పెంచి పెళ్లి చేయడమే కాదు వాళ్ల ఇష్టాలనూ గౌరవించాలని చెప్పే చిత్రమిది. నేపథ్యంగా సినిమా రంగాన్ని ఎంచుకున్నారు కాబట్టి వినోదానికి అవకాశం ఏర్పడింది. అయితే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దానికి కారణాలెన్నో. ఇండస్ట్రీలోనే ఉంటూ ఇక్కడ జరిగే తప్పులన్నీ చెప్పలేరు. అలాగని ఇండస్ట్రీ గొప్పదని సందేశం ఇచ్చినా అది పూరీ జగన్నాథ్ తీసిన నేనింతే మూవీలా అవుతుంది. దాంతో ఆ స్వేచ్ఛ కొద్దిగానే తీసుకుంటూ కథను సాగించాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సాధారణంగా ఆయన సినిమాల్లో అద్భుతాలు ఆశించలేం. ఆ అంచనాల్ని ఈ చిత్రంలోనూ నిలబెట్టుకున్నారు. కానీ సకుటుంబంగా సినిమా చూసేలా ఏ ఇబ్బందీ పెట్టకుండా అహ్లాదంగా కథను తెరకెక్కించడం ఆయన మార్క్. ఈ చిత్రంలో అసలు కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడికి ఒక హాఫ్ సినిమా కావాల్సి వచ్చింది. ఇంటర్వెల్ నుంచే కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
ప్రేక్షకుల ఊహకు తగినట్లే విరామం నుంచి శుభం కార్డ్ దాకా సినిమా వెళ్తుంది. ఇక్కడే ద్వితీయార్థంలో ఆసక్తి తగ్గిపోయింది. అవసరాల శ్రీనివాస్ లాంటి క్యారెక్టర్ లను తీసుకొచ్చి కథలో చేర్చినా, వాటినీ ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం చేశారు. దీంతో సినిమా మొత్తంలో కొన్ని మెరుపులే మిగిలాయి. కథలో ఫైట్స్, పాటలు వంటి కమర్షియల్ అంశాలకు చోటున్నా వదిలేశారు. అవీ పెడితే ఈ గొప్ప కథ సాధారణ స్థాయికి దిగజారుతుందని అనుకున్నారేమో. దర్శకుడు నవీన్ పాత్రలో సుధీర్ బాబు ఆకట్టుకున్నారు. తన సినిమా కోసం నాయికను ఒప్పించే క్రమంలో, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడే సన్నివేశాల్లో సుధీర్ నటన పరిణితితో కనిపిస్తుంది. కృతి శెట్టి కెరీర్లో ఇదొక స్పెషల్ మూవీ. ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది. డాక్టర్ అలేఖ్యగా ఆమె అందంగా కనిపించింది. సహజంగా నటించింది. ఈ భావోద్వేగ కథలో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ రిలీఫ్ ఇస్తుంది. కథనంలో వేగం పెంచి, మరికొంత ఫన్ చేర్చితే ఫలితం మరోలా ఉండేది.
చివరగా...మరీ నెమ్మదిగా చెప్పారు
రేటింగ్ 2.5/5
Read More :
“Krithi Shetty | ఓర చూపులతో కసిగా చూస్తున్న కృతి శెట్టి..”
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

