విలక్షణ హీరో కమల్ హాసన్ (Kamal Haasan)నటించిన విక్రమ్ (Vikram) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్‌గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లను రాబట్టింది. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.విడుదలైనప్పటి నుంచి దాదాపు చాలా రోజుల వరకు ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలిచింది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త న్యూస్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
విక్రమ్ తెలుగు వెర్షన్ టెలివిజన్‌లో ప్రసారమైంది. తాజా నివేదికల ప్రకారం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిన ఈ చిత్రం మొదటి టీవీ ప్రీమియర్‌లో తక్కువ టీఆర్పీ రేటింగ్ 5.1(TRP Ratings)గా నమోదైంది. థియేటర్ల తర్వాత ఓటీటీలోకి కూడా విక్రమ్ రావడంతో చాలా మంది సినిమాను చూశారు. విక్రమ్ టీవీ టీఆర్పీ రేటింగ్ తగ్గడానికి ప్రధాన కారణమిదే అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు.
లోకేశ్ కనగరాజు దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ హీరో సూర్య రోలెక్స్ పాత్రలో నటించాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీ రోల్స్ పోషించారు. కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్ కమల ఇంటర్నేషనల్పై తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.