Vaibhav Sooryavanshi | వైభవ్ వీరకొట్టుడు.. సిరాజ్ మళ్లీ బలయ్యాడుగా..!
Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటివరకూ వన్డే, టీ20ల్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన ఈ చిచ్చరపిడుగు.. ఈసారి ఎర్ర బంతిపైనా పగబట్టినట్టే ఆడాడు.
Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటివరకూ వన్డే, టీ20ల్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన ఈ చిచ్చరపిడుగు.. ఈసారి ఎర్ర బంతిపైనా పగబట్టినట్టే ఆడాడు. వైభవ్ బౌండరీలతో విరుచుకుపడగా టీమిండియా సీనియర్ పేసర్ మహహ్మద్ సిరాజ్ బిత్తరపోయాడు. ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో సిరాజ్ ఓవర్లో ఎడాపెడా దంచేసిన ఈ కుర్రాడు ఇప్పుడు దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ చుక్కలు చూపించాడు.
‘బౌలర్ ఎంతటివాడైనా నాకేంటీ.. నా స్టయిల్ ఇంతే’ అన్నట్టుగా చెలరేగే వైభవ్ సూర్యవంశీ మరో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ ఓపెనర్‌గా ఆడుతున్న వైభవ్ ఫైనల్లో దంచేశాడు. సౌత్ జోన్ బౌలర్లను హడలెత్తించిన ఈ పదిహేనేళ్ల కుర్రాడు.. సిరాజ్ బౌలింగ్‌లోనూ చితక్కొట్టాడు. సీనియర్ పేసర్ అయిన అతడి ఓవర్లో వరసగా 4, 6.. చివరి బంతికి బౌండరీతో రెచ్చిపోయాడీ బ్యాటింగ్ సంచలనం. దాంతో, ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ పేసర్‌గా ఆడిన సిరాజ్‌కు చుక్కలు చూపించిన వైభవ్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలోనూ పైచేయి సాధించాడు.
Sooryavanshi off to a flier, as usual!🔥🏏
He takes on Siraj for 14 runs in the over! 💥#VaibhavSooryavanshi : 36 off 27 balls — 5️⃣ fours, 1️⃣ six
East Zone: 60/0 after 9 overs, having elected to bat. 👏#EZvSZ #DuleepTrophy #Final #Chennaipic.twitter.com/sxrcVNWP2Y
— lightningspeed (@lightningspeedk) September 6, 2026
35 బంతుల్లోనే
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌గా పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్‌పై 35 బంతుల్లోనే మెరుపు శతకంతో చరిత్ర సృష్టించాడు. ఏకంగా 7 ఫోర్లు, 11 సిక్సర్లతో.. 265.79 స్ట్రయిక్ రేటుతో రికార్డు సెంచరీ సాధించాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ ఫైనల్లో మియా భాయ్‌కి ఐపీఎల్ విధ్వంసాన్ని గుర్తు చేశాడు. సౌత్ బౌలర్లను భయపెడుతూ తొలి వికెట్‌కు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(72)తో కలిసి వంద రన్స్ జోడించిన వైభవ్.. 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. అర్ధ శతకం చేజార్చుకున్నప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లోనూ తాను మెరుపులు మెరిపించగలనని నిరూపించాడీ హిట్టర్.
𝙊𝙣𝙚 𝙛𝙤𝙧 𝙩𝙝𝙚 𝙝𝙞𝙨𝙩𝙤𝙧𝙮 𝙗𝙤𝙤𝙠𝙨 📚
🎥 Running it back to when #TATAIPL‘s youngest ever debutant Vaibhav Sooryavanshi did this 👇 on the very 1⃣st delivery he faced 🔥@rajasthanroyals pic.twitter.com/SoA8ubxamY
— IndianPremierLeague (@IPL) March 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

