హైదరాబాద్ : నగరంలో గుట్టుగా కొనసాగిస్తున్న కోడి పందెల( Cockfighting ) ఆటను ఆదిబట్ల పోలీసులు ( Adibatla Police ) రట్టు చేశారు. ఈ కేసులో 22 మందిని అరెస్టు ( Arrest ) చేసి నగదును, విలువైన కోళ్లను, కార్లను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ జోన్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ బృందానికి వచ్చిన సమాచారం మేరకు మన్నెగూడ ఆర్టీవో కార్యాలయం వెనుక భాగంలో కోళ్ల పందెల డెన్‌పై ఆదిబట్ల పోలీసుల సహకారంతో దాడి నిర్వహించారు. ఈ ప్రాంతంలో పాత కోళ్ల ఫారంలో పందెలను నిర్వహిస్తున్నారని పోలీసులు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోళ్ల పందెలతో పాటు ప్లేయింగ్ కార్డ్సు ఆడుతున్నారని వివరించారు. ఈ కేసులో 22 మందిని అరెస్టు చేసి రూ.3.60లక్షల నగదును సీజ్ చేశామని వెల్లడించారు. ప్రధాన నిర్వాహకుడు, ల్యాండ్ ఓనర్ పరారీలో ఉన్నారని తెలిపారు.
ఘటనా స్థలం వద్ద రూ.9.30 లక్షల విలువ గల 31 కోళ్లను స్వాధీనం చేసుకున్నామ న్నారు. కోళ్ల కాళ్లకు ఉపయోగించే 148 కత్తులు, 20 సెల్ఫోన్లను , మూడు కార్లను, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.