Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. గత నెల మే 30న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తుదంటూ పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్ కానీ.. ఈ తేదీకి వీరమల్లు కూడా రాకపోవడంతో తేదీ వృధాగా పోయింది. ఆ తర్వాత ఇండియా పాకిస్థాన్ మధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమాను జూలై 04న తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ తేదీ కూడా క్యాన్సిల్ అవ్వడంతో తాజాగా మరో డేట్ ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాను జూలై 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే కింగ్డమ్ వచ్చే కంటే ఒకరోజే ముందే వీరమల్లు రాబోతుంది. హరిహర వీరమల్లుని జూలై 24న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే రెండు సినిమాలకు గట్టి పోటి ఉండబోతుందని సమాచారం.
కింగ్డమ్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ను హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంకలో చిత్రీకరించినట్లు సమాచారం.
Read More