Vijay Deverakonda | ఒక్కో కుటుంబానికి రూ.లక్ష.. లిస్ట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ముందుగా ప్రకటించినట్లు 100 కుటుంబాలను ఎంపిక చేసి ఆ లిస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. విజయ్ ‘ఖుషి’ (Kushi) చిత్రం ద్వారా తాను సంపాదించిన (Kushi salary) మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ( 100 families) ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర సక్సెస్ మీట్లో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. ఓ వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కును వారం పదిరోజుల్లో అందజేస్తానని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన మాటను నిలబెట్టుకున్నాడు.
100 కుటుంబాలను ఎంపికచేసి ఆ లిస్టును విజయ్ సోషల్ మీడియాలో గురువారం రిలీజ్ చేశారు. ‘వంద కుటుంబాలను ఎంపిక చేశాం. నేను చేసే ఈ చిన్న సాయం మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు లోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం. త్వరలోనే వీరికి చెక్కులు పంపిణీ చేయనున్నారు.
I wanted to share my success & happiness with you ❤️
So decided to share 1 crore from my #Kushi earnings with you. 100 families will be given 1 lac each!
Apply below. It would make me happy if it really helped someone.https://t.co/U8A3bVp1kn#SpreadingKushi ❤️#DevaraFamily…
— Vijay Deverakonda (@TheDeverakonda) September 5, 2023
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి (Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించిన ఖుషి ప్రొమోషనల్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ఓ కీలక ప్రకటన చేశారు. ఖుషి చిత్రం ద్వారా తాను సంపాదించిన (Kushi salary) మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ( 100 families) ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
‘ఖుషి చిత్రం ఇవాళ ఫేక్ రివ్యూలను, తప్పుడు ప్రచారాలను అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులే. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. కానీ, అభిమానుల ప్రేమ ముందు అవేవీ పనిచేయలేదు. అభిమానుల ముఖాల్లో ఆనందం చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో పంచుకోవాలని ఉంది కానీ, అది సాధ్యం పడదు. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటాను. కానీ, ఇప్పటి నుంచి మీ ( ఫ్యాన్స్) అందరి కోసం పనిచేయాలనుకుంటున్నాను. మీరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనమంతా ఓ ఫ్యామిలీ. అందుకే నా విజయం, సంతోషంతోపాటు నా సంపాదనను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఖుషి చిత్రం ద్వారా నేను సంపాదించిన మొత్తంలో ఒక రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఓ వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కును వారం పదిరోజుల్లో అందజేస్తాను’ అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.
Also Read..
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Kerrthy Suresh | ‘జవాన్’ చలేయా పాటకు స్టెప్పులేసిన కీర్తి సురేష్.. వీడియో వైరల్
Khufiya Movie | కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన టబు.. ఈసారి పూర్తి యాక్షన్ రోల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

