Hari Hara Veera Mallu | ధర్మం కోసం యుద్ధం.. ‘హరి హర వీరమల్లు’ నుంచి టీజర్ అప్డేట్
Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ ఎన్నికల బిజీలో ఉన్న విషయం తెలిసిందే. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగనుండగా.. ప్రచారంలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
Hari Hara Veera Mallu | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ ఎన్నికల బిజీలో ఉన్న విషయం తెలిసిందే. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగనుండగా.. ప్రచారంలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే పవన్ ఎన్నికల కంటే ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి హరిహర వీరమల్లు ( Hari Hara Veera Mallu). జాగర్లమూడి క్రిష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ షూటింగ్లో జాయిన్ కానున్నాడు పవన్. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా టీజర్‌ను మే 02న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ధర్మం కోసం యుద్ధం! గురువారం 9 గంటలకు అంటూ చిత్రయూనిట్ రాసుకోచ్చింది.
ధర్మం కోసం యుద్ధం! ⚔️🔥
Teaser of the much-anticipated #HariHaraVeeraMallu will be out on MAY 2nd @ 9:00 AM! 💥#HHVMTeaserOnMay2nd ❤️🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes… pic.twitter.com/luWLeeFNSl
— BA Raju’s Team (@baraju_SuperHit) April 30, 2024
పవన్ కల్యాణ్ కెరీర్లోనే తొలిసారి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

