Khufiya Movie | సీనియర్ హీరోయిన్ టబు (Tabu) గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. కూలీ నెం 1 సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టింది. తెలుగులో నటిస్తూనే తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వయసు 51 దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా.. టబు తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఖుఫియా (Khufiya). ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ (Vishal Bharadwaj) దర్శకత్వం వహిస్తున్నాడు. మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ (Ali Fazal), వామికా గబ్బి (Wamiqa Gabbi) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీని అక్టోబర్ 05న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనితో పాటు ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఒక గుర్తు తెలియని వ్యక్తి టాప్ సీక్రెట్స్‌ని దొంగిలిస్తుండగా.. అతడు ఎవరో కనిపెట్టేలా టబు ప్రయత్నిస్తుంది. కాగా ఖుఫియా మూవీ ఎదో టాప్ సీక్రెట్ మిషన్ ఆధారంగా రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వీడియోను మేకర్స్ షేర్ చేస్తూ.. ”కొన్ని రహస్యాలు రహస్యంగా ఉంటేనే మంచిది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Kuch raaz, raaz hi rahe to behtar hai. But not this one 👀
Bringing you the most #Khufiya mission on October 5, only on Netflix! pic.twitter.com/86NDcLldfj— Netflix India (@NetflixIndia) September 14, 2023
అంతకుముందు ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్కు సంబంధించి మేకర్స్ ఒక ఫన్నీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో స్క్రిప్ట్ చూసిన టబు స్క్రిప్ట్ అంతా సీక్రెట్‌గా ఉంది. స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతుంది. మరోవైపు అలీ ఫజల్ మాట్లాడుతూ.. మీ స్క్రిప్ట్‌ని నేను ఎందుకు లీక్ చేస్తాను సర్ అంటూ అడుగుతాడు. తదుపరి సీన్లో వామికా గబ్బి మాట్లాడుతూ విశాల్ ప్రాజెక్ట్‌లో నేను హీరోయిన్ సెలెక్ట్ అయ్యాను. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయాలి అంటుండగా.. భరద్వాజ్ సీక్రెట్‌గా ఉంచూ ఖుఫియా అంటూ రిప్లయ్ ఇస్తాడు. ఇక అయోమయ స్థితిలో ఉన్న నటీనటులు, షూట్ జరుగుతున్న ప్రదేశం, రెమ్యూనరేషన్ మొదలైన ప్రాజెక్ట్ వివరాలను గురించి భరద్వాజ్‌ని అడగడం కనిపిస్తుంది. ఫన్నీగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Film itni Khufiya rakho ki actors bhi pooche “Film kya hai?!” 🧐
This #Khufiya mission is coming soon, only on Netflix! pic.twitter.com/XO2ABeee6B— Netflix India (@NetflixIndia) September 13, 2023