హైదారాబాద్ : వికారాబాద్ జిల్లాలో(Vikarabad district) విషాదం చోటు చేసుకుంది. తాండూరు డిపో(Tandoor Depot) ఆర్టీసీ డ్రైవర్(RTC driver) రాజప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య (Committed suicide) చేసుకుంటున్నట్లు లేఖ రాసి యాలాల మండలం దౌలాపూర్లో చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాజప్ప మృతిదో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.