Mehreen Pirzada | షాకింగ్ డెసిషన్.. ‘ఎగ్ ఫ్రీజింగ్’ చేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్
Mehreen Pirzada | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ గురించి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Mehreen Pirzada | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. ఫ్యామిలీ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ గురించి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత జనరేషన్లో మంచి రిలేషన్ దొరకడం కష్టమవుతుందని అందుకే తాను ‘ఎగ్ ఫ్రీజింగ్’ గురించి అలోచిస్తున్నట్లు మృణాల్ చెప్పుకోచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) ఏకంగా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గత రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా.. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి అయ్యింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని మొదట అందరికి చెప్పాలా లేదా అని చాలా ఆలోచించాను. కానీ నాలాంటి మహిళలు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. మ్యారేజ్, ప్రెగ్నన్సీ విషయంలో వాళ్లు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కానీ నా లైఫ్ అలా అవ్వాలని అనుకోలేదు. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. అందుకే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నా. ఈ ప్రయణంలో నాకు అండగా నిలిచిన నా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్’ అని చెప్పుకోచ్చింది.
‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటే.?
కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటారు. దీనినే ‘క్రయో ఫ్రీజింగ్’ అని కూడా వ్యవహరిస్తారు. తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లలకు అండాలు తయారవుతాయి. అంటే పుట్టుకతోనే ఆడపిల్ల కడుపులో అండాలు ఉంటాయి. ఆ సంఖ్య కూడా పుట్టుకతో ఉన్నదే తప్పించి, ఆ తర్వాత అధికం కావడం అంటూ ఉండదు. అయితే, పాపాయి జన్మించినప్పుడు సుమారు 20 లక్షల అండాలు ఉంటే, రజస్వల సమయానికి సుమారు అరవై వేలకు పడిపోతుంది. చాలా అండాలు వాటికవే చనిపోతాయి. మిగిలిన అండాల్లోంచి కూడా.. బయటికి విడుదల అయ్యేందుకు ప్రతినెలా సుమారు 300 అండాలు పోటీ పడతాయి. అందులో అన్నిటికంటే బలమైన అండమే అంతిమంగా విడుదల అవుతుంది. మిగతావన్నీ వృథా అయినట్టే. అలా ఏండ్లు గడుస్తున్న కొద్దీ, అంటే ఆడవాళ్లకు ముప్పై అయిదేండ్లు దాటుతున్న కొద్దీ అండాల్లో నాణ్యత తగ్గిపోతూ వస్తుంది.
మగవాళ్లలో మాత్రం.. ఇందుకు విరుద్ధంగా ఎప్పటికప్పుడు వీర్యం తయారవుతూ ఉంటుంది. అంటే, వయసు ఎక్కువ ఉన్న అండాన్ని చురుకైన శుక్రకణం కలవడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఇబ్బందిని తప్పించుకునేందుకు కొందరు చిన్న వయసులోనే అండాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చి.. ఒకేసారి ఎక్కువ అండాలు మెచ్యూర్ అయ్యేలా చేస్తారు. అలా మెచ్యూర్ అయిన అండాలను సేకరించి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు. వీటిని ఐవీఎఫ్లాంటి పద్ధతుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలదీకరణం చెందించి బిడ్డను పొందవచ్చని ఆలోచన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

