Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి సినీ ప్రముఖులే కాకుండా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలోని ‘చలేయా’(Chaleya) అనే సాంగ్ చాలా పెద్ద హిట్టయింది. రొమాంటిక్ మెలోడిగా వచ్చిన ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఇక ఈ పాటకు స్టెప్పులేసిన వీడియోలను (viral video) పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లేటెస్ట్గా ఈ సాంగ్‌కు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh), అట్లీ (Atlee) సతీమణి ప్రియ మోహన్ (Priya Mohan) స్టెప్పులేశారు. కీర్తి సురేష్‌కు అట్లీ (Atlee) ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి రిలేషన్ ఉంది. ‘జవాన్’ (Jawan) విడుదలకు ముందు కూడా కీర్తి సురేష్, అట్లీ, ప్రియ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో సందడి చేశాయి. తాజాగా ‘జవాన్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో కీర్తి సురేష్, ప్రియ కలిసి ‘చలేయా’ అనే సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇక ఈ డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అట్లీ తన పెట్‌తో కనిపించాడు. ఇక కీర్తి సురేష్, ప్రియ క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
❤️❤️❤️ 😜#jawanlove @KeerthyOfficial @Atlee_dir #beckypapa pic.twitter.com/SS6ozuSnHG
— Priya Mohan (@priyaatlee) September 13, 2023
Tomorrow is a very special day because the world is going to witness your magic machi! @Atlee_dir
My excitement is at its peak for all you nanbas @anirudhofficial @priyaatlee @dop_gkvishnu 🤗
It is going to be a treat to watch King Khan @iamsrk in this new avatar! We all are… pic.twitter.com/e9JHvfMXTW— Keerthy Suresh (@KeerthyOfficial) September 6, 2023