Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా అల్లు అర్జున్ ‘జవాన్’ చిత్రానికి రివ్యూ ఇచ్చారు.
Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటిసినీ ప్రముఖులే కాకుండా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలోని షారుఖ్ నటనకు మైమరచిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చి చేరారు.
తాజాగా అల్లు అర్జున్ ‘జవాన్’ చిత్రానికి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ముందుగా ఇంత పెద్ద హిట్ సొంతం చేసుకున్నందుకు చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జవాన్ మూవీ పూర్తిగా షారుఖ్ మాస్ అవతార్ అని కొనియాడారు. మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ రాసుకొచ్చాడు. అలాగే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి తన పాత్రలో ఎప్పటిలాగే చాలా అద్భుతంగా నటించారన్నారు. నయనతార, దీపికా నటన గురించి, అనిరుద్ మ్యూజిక్ గురించి ప్రశంసించాడు. ఇక మనందరం గర్వపడేలా, ఆలోచింపజేసే కమర్షియల్ సినిమాని అందించి నేషనల్ వైడ్ సునామీ సృష్టించిన దర్శకుడు అట్లీని అభినందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Biggg Congratulations to the whole team of #JAWAN for this mammoth blockbuster . Warm regards to the entire cast , technicians, crew & producers of #JAWAN @iamsrk garu’s Massiest avatar ever , charming the whole of India & beyond with his swag . Truly happy for you sir , we…
— Allu Arjun (@alluarjun) September 14, 2023
జవాన్ చిత్రం గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. షారుఖ్ గత రికార్డులను కూడా ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ చేసేసింది.
Also Read..
Nipah virus | కేరళలో నిఫా బంగ్లాదేశ్ వేరియంట్.. వ్యాప్తి తక్కువే అయినప్పటికీ మరణాల రేటు ఎక్కువ
Libya Floods | లిబియాలో మృత్యుఘోష.. వరదలకు 20 వేల మంది బలి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

