Libya Floods | లిబియాలో మృత్యుఘోష.. వరదలకు 20 వేల మంది బలి
Libya Floods | డేనియల్ తుఫాను (Daniel Storm) సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా (Libya) అతలాకుతలమైంది. వరదల ధాటికి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జలప్రళయంలో మరణించిన వారి సంఖ్య 20,000 వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
Libya Floods | డేనియల్ తుఫాను (Daniel Storm) సృష్టించిన జలప్రళయంతో ఆఫ్రికా దేశం లిబియా (Libya) అతలాకుతలమైంది. వరదల ధాటికి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జలప్రళయంలో మరణించిన వారి సంఖ్య 20,000 వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. పదివేలకు పైనే ప్రజలు గల్లంతయ్యారు. కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
ఈ మేరకు అరేబియా టెలివిజన్‌తో డెర్నా (Derna) మేయర్ అబ్దుల్మేనమ్ మాట్లాడుతూ.. ఈ విపత్తు కారణంగా నగరంలో మరణాల సంఖ్య 18,000 నుండి 20,000 వరకు ఉంటుందని అంచన వేస్తున్నట్లు వెల్లడించారు. బీచ్ ఒడ్డున ఎక్కడ చూసినా శవాలు చెల్లాచెదురుగా పడి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూస్తుంటే ఎంతో బాధగా ఉందని పేర్కొ్న్నారు. శవాలను తగుల బెట్టడానికి కూడా స్థలం లేక సామూహిక ఖననం చేస్తున్నట్లు వెల్లడించారు. వరద సంభవించిన సమయంలో చాలా మంది నిద్రలోనే జల సమాధి అయిపోయారని తెలిపారు.
మరోవైపు డెర్నా నగరంలో రహదారులు కొట్టుకపోవడంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందించడంలోనూ తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో లిబియాకు ఈజిప్ట్, అల్జీరియా, టునీసియా, తుర్కియే, యూఏఈ సహాయక బృందాలను, ఔషధాలను పంపాయి. మరోవైపు విపత్తులో అతలాకుతలమైన లిబియాలో సహాయక కార్యక్రమాల కోసం అత్యవసర నిధులు పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
డేనియల్ తుఫాన్ ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. కొన్ని గంటల వ్యవధిలోనే తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా తూర్పు లిబియాలోని డెర్నా (Derna ) పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడ వీధుల్లో, అపార్టుమెంట్లు సహా రోడ్లపై ఎక్కడ చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడి ఉన్నాయి. ఈ వరద ప్రవాహానికి ప్రజలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Also Read..
Leopard | కామారెడ్డిలో చిరుత కలకలం.. లేగ దూడను ఎత్తుకెళ్లిన పులి
Chandrababu | 12 గంటలకు చంద్రబాబుతో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

