తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విజయ్‌కాంత్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యేక డాక్టర్స్ బృందం విజయ్‌కాంత్ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు.
విజయ్‌కాంత్ పార్టీ ప్రెస్ ఒకటి విడుదల చేయగా, జనరల్ హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు . మరో రెండు రోజులలో ఆయన డిశ్చార్జ్ అవుతారు. ఎవరు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. విజయ్‌కాంత్ గత ఏడాది సెప్టెంబర్‌లో కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
Official statent from #DMDK says popular actor and politician #Captain #Vijayakant has been admitted to hospital for routine health check up and is in good condition and will be discharged in a day or two pic.twitter.com/qnDnEBV4dH
— BA Raju's Team (@baraju_SuperHit) May 19, 2021