The GOAT | ది గోట్ (The GOAT) భారీ అంచనాల మధ్య విడుదలైంది. తమిళంలో సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. విజయ్ యాక్టింగ్‌పై మూవీ లవర్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నా.. రన్ టైం విషయంలో మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే పెద్ద టాస్క్లాంటిదే. అంతేకాదు ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే కూడా కష్టమనే చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ది గోట్‌కు వస్తోన్న రెస్పాన్స్ నాని నటించిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వసూళ్లకు కలిసొచ్చేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వీకెండ్ వినాయక చవితి నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సినీ జనాలకు సరిపోదా శనివారం ఫస్ట్ చాయిస్ అవనుంది. తారక్ నటించిన దేవర రిలీజ్‌కు కూడా ఇంకా టైం ఉండటంతో.. అప్పటివరకు సోలోగా ఎంటర్టైన్మెంట్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సరిపోదా శనివారంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. ఎస్జే సూర్య (SJ Suryah) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తోంది. ది గోట్లో విజయ్ తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్లో నటించగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, వీటీవీ గణేశ్, అజ్మల్ అమీర్, మనోబాల ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే