The Goat | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. . ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ది గోట్ 2024 (ఇప్పటివరకు)లో హయ్యెస్ట్ గ్రాసర్ సాధించిన తమిళ సినిమాగా రికార్డుల్లో నిలిచింది. ఓవర్సీస్, కర్ణాటక, నార్తిండియా, వరల్డ్‌వైడ్‌గా ఇదే ట్రెండ్‌ను క్రియేట్ చేయడం విశేషం. ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ టూర్స్, ఓవర్సీస్ ప్రమోషన్స్, నార్తిండియా మల్టీప్లెక్స్ విడుదల లాంటివేమీ లేకుండా.. 4 వీక్ ఓటీటీ అగ్రిమెంట్‌తో వరల్డ్‌వైడ్‌గా రూ.460 కోట్లు గ్రాస్ సాధించి అరుదైన రికార్డుతో వార్తల్లో నిలిచింది ది గోట్.
విజయ్ క్రేజ్ ఎలా ఉందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలనడంలో ఎలాంటి సందేహం లేదు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కించగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
– No audio launch
– No pre-release events
– No promotional tour across India
– No overseas promotions
– No multiplex release in North India
– 4-week OTT agreementYet, with less hype compared to #Leo, #TheGOAT crossed 460CR+ WW!@actorvijay pic.twitter.com/bFqikARttK
— THALAPATHY YOKESH❣️ (@Yokesh_msd) November 15, 2024
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట