కోలీవుడ్ (Kollywood ) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా సినిమా బీస్ట్ (Beast). మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో బీస్ట్ టీం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే డైరెక్టర్ నెల్సన్ హీరో విజయ్ను ఇంటర్వ్యూ చేయగా..నేడు రిలీజ్ చేశారు. ఈ ఇంటర్య్వూలో విజయ్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
తాను ఎందుకు ప్రెస్ మీట్లకు హాజరవడం లేదో, ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వడం లేదో క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో టైంలో మీడియా తన కామెంట్లను తప్పుగా ప్రచారం చేసిందని, సదరు మీడియా నా వ్యాఖ్యలను వివాదాస్పదం చేసింది. అందుకే ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్టు పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న బీస్ట్ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Read Also : The Kashmir Files producer | ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత కొత్త సినిమాల ప్రకటన
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన హలమితి హబిబో సాంగ్ ఇండియాతోపాటు వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ అదరగొట్టిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
Read Also : Hari Hara Veera Mallu Action | హరిహర వీరమల్లు ఎంతమందితో ఫైట్ చేస్తున్నాడో తెలుసా..?