Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తోన్న వీడీ 12 (VD12). కాప్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం కోసం సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మూవీ నుంచి ఓ స్టిల్ లీక్ కాగా విజయ్ స్టన్నింగ్ మేకోవర్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. స్టిల్‌ను షేర్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుందట విజయ్ టీం. తాజా టాక్ ప్రకారం 60 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శ్రీలంక కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రానికి పాపులర్ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. విజయ్ దేవర కొండ మరోవైపు టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో VD14 మూవీ కూడా చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola)తో సినిమా చేస్తున్నాడు.
Taapsee Pannu | తాప్సీ పన్ను ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా ట్రైలర్ లుక్ వైరల్
Dulquer Salmaan | జులై 27న రెడీగా ఉండండి.. దుల్కర్ సల్మాన్ నుంచి సర్ప్రైజ్..!
Dhanush | రాయన్ బుకింగ్స్‌కు సూపర్ రెస్పాన్స్.. ధనుష్ న్యూ లుక్ వైరల్