Dulquer Salmaan | జులై 27న రెడీగా ఉండండి.. దుల్కర్ సల్మాన్ నుంచి సర్ప్రైజ్..!
Dulquer Salmaan | ఇటీవలే నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీలో అతిథి పాత్రలో మెరిశాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)... తాజాగా ఈ స్టార్ హీరో కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
Dulquer Salmaan | తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మలయాళ హీరోల్లో ఒకరు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ఇటీవలే నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీలో అతిథి పాత్రలో మెరిశాడు. తాజాగా ఈ స్టార్ హీరో కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. దయా ఫేం పవన్ సాదినేనితో సినిమా చేయబోతున్నాడు దుల్కర్ సల్మాన్. దీనిపై ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా జులై 28న దుల్కర్ సల్మాన్ బర్త్ డే నేపథ్యంలో పవన్ సాదినేని Pavan Sadineni హింట్ ఇచ్చి మూవీ లవర్స్, అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.
ఎక్కువగా ఏం చెప్పకుండా జులై 27న భారీ ప్రకటన ఉండబోతుందంటూ ట్వీట్ చేశాడు పవన్ సాదినేని. ఇది ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్ మూవీ వార్తేనని తెగ సంబురాలు చేసుకుంటున్నారు అభిమానులు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలకు రెడీ అవుతోంది. ఇంకేంటి మరి మరో మూడు రోజుల్లో దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్ ఏంటో క్లారిటీ వచ్చేస్తుందన్నమాట.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో లాంఛ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు.
అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. . ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. అంటూ సాగే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
27th July🌫️☁️💫
— pavan sadineni (@pavansadineni) July 24, 2024
లక్కీ భాస్కర్ టీజర్…
Read Also :
Taapsee Pannu | తాప్సీ పన్ను ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా ట్రైలర్ లుక్ వైరల్
Dhanush | రాయన్ బుకింగ్స్‌కు సూపర్ రెస్పాన్స్.. ధనుష్ న్యూ లుక్ వైరల్
‘Khel Khel Mein’ | ఇండిపెండెన్స్ బరిలో అక్షయ్ కుమార్, తాప్సీ ‘ఖేల్ ఖేల్ మే’.. ఫస్ట్ లుక్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

