VD12 | జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న చిత్రం వీడీ 12 (VD12). కాప్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. వీడీ 12 ఫస్ట్ లుక్‌తో విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ.. అంటూ షేర్ చేసిన లుక్‌లో పొట్టి హెయిర్, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంలో ఉన్న విజయ్ దేవరకొండ బిగ్గరగా అరుస్తూ కనిపిస్తున్నాడు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 28న 2025లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. విజయ్ దేవరకొండ అండ్ టీం ఇటీవలే శ్రీలంకలో వచ్చే కీలకఈ సినిమా 2025లో థియేటర్లలో సందడి చేయనుంది. VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. పాపులర్ మలయాళ టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
His Destiny awaits him.
Mistakes.
Bloodshed.
Questions.
Rebirth.28 March, 2025.#VD12 pic.twitter.com/z2k0qKDXTC
— Vijay Deverakonda (@TheDeverakonda) August 2, 2024
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Aamir Khan | క్రేజీ టాక్.. ఆ డైరెక్టర్‌నే నమ్ముకున్న అమీర్‌ఖాన్..!