VD12 | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తోన్న వీడీ12 (VD12). ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ ముందుగా మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. అయితే తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీని మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. విడుదలకు మరింత సమయం దొరకడంతో.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సినిమా ప్రమోషన్స్ కోసం ఈ టైంను వినియోగించుకోవాలని కోరుతున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు.ఈ చిత్రానికి పాపులర్ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ (Gireesh Gangadharan) పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ మరోవైపు రాజావారు రాణిగారు ఫేం రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వంలో VD14 మూవీ కూడా చేస్తున్నాడు. SVC59 ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.
#VD12 – 30th MAY, 2025! 💥🔥 pic.twitter.com/FGvOXhUCvF
— Movies4u Official (@Movies4u_Officl) January 20, 2025
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?