టాలీవుడ్ (Tollywood) యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం లైగర్ (Liger) సినిమాపైనే ఫోకస్ అంతా పెట్టాడు. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Panday) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర ప్రకటన విజయ్ దేవర కొండ నుంచిరాబోతుంది. అది కూడా ఎప్పుడో కాదు..రేపే. సెప్టెంబర్ 27న (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ లాంఛ్ కాబోతుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రస్తుతం గోవాలో లైగర్ చిత్రీకరణ కొనసాగుతుంది. యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలను విదేశీ మార్షల్ ఆర్ట్స్ నిపుణుల నేతృత్వంలో ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. పూరీజగన్నాథ్, ఛార్మి సహనిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా లైగర్ ను తెరకెక్కిస్తున్నారు. గతేడాది విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాపీస్ బోల్తా కొట్టింది. ఆ తర్వాత జాతిరత్నాలు చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశాడు.
One more night's sleep.
— Vijay Deverakonda TOOFAN (@TheDeverakonda) September 26, 2021
And then we announce.. #LIGER pic.twitter.com/UhsO0KtEEx
పాన్ ఇండియా కథాంశంతో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న లైగర్ తో హిందీ లో మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని విజయ్ ఫిక్సయ్యాడని ఇప్పటికే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరి లైగర్ సినిమాకు వచ్చే స్పందన బట్టి విజయ్ నెక్ట్స్ షెడ్యూల్ పై స్పష్టత వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!