Vijay devarakonda Liger shoot wrapped | రెండేండ్లుగా షూటింగ్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. 2020లో మొదలైన ఈ చిత్ర షూటింగ్‌కు మధ్యలో కరోనా బ్రేకులు బాగానే పడ్డాయి. సాధారణంగా ప్రతి సినిమాను ఆర్నెళ్లలోనే పూర్తి చేసే పూరీ.. లైగర్ సినిమాను మాత్రం గత రెండేండ్లుగా చెక్కుతూనే ఉన్నాడు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రం కోసం తనను తాను బాగా మార్చుకున్నాడు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఈయన గత సినిమాలు రెండు డిజాస్టర్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడంతో.. మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమాపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయి.
తెలుగుతో పాటు ఒకేసారి తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో లైగర్ సినిమా విడుదల కానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డుతో పని లేకుండా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఒకేసారి హిందీ, తెలుగులో సినిమా షూట్ పూర్తి చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. మిగిలిన భాషల్లో దీనిని డబ్బింగ్ చేయనున్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి కావడంతో అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది నిర్మాత ఛార్మి. ఐదేండ్ల కింద అంటే 2017 ఆగస్ట్ 25న అర్జున్ రెడ్డి సినిమా విడుదలైంది. మళ్లీ ఇప్పుడు అదే రోజున లైగర్ సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు.
లైగర్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. విజయ్ దేవరకొండ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఈ మధ్యే సుకుమార్ పుట్టిన రజు సందర్భంగా తమ కాంబినేషన్లో విజయ్ దేవరకొండ సినిమాను అధిక ప్రకటించాడు. సుకుమార్ తర్వాత మజిలీ, నిన్ను కోరి సినిమాల దర్శకుడు శివ నిర్వాణతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. నానితో చేసిన టక్ జగదీశ్ అంచనాలు అందుకోకపోవడంతో శివ నిర్వాణ కాంబినేషన్లో రావాల్సిన విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ ఆ అందులో ఎలాంటి నిజం లేదని.. తమ కాంబినేషన్లో సినిమా వస్తుందని క్లారిటీ ఇచ్చాడు శివ నిర్వాణ. పూరీతో కూడా మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు సమాచారం.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
ఆ గ్యాప్‌లోనే పూరీ ‘జనగణమన’ను పూర్తి చేస్తాడా..?
విజయ్ దేవరకొండ ప్లానింగ్ మామూలుగా లేదు.. లైన్లో అరడజన్ సినిమాలు..
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?