విజయ్ దేవరకొండ ప్లానింగ్ మామూలుగా లేదు.. లైన్లో అరడజన్ సినిమాలు..
Vijay devarakonda | కెరీర్ మొదలు పెట్టిన తర్వాత భారీ గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు విజయ్ దేవరకొండ.. కానీ డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచిన తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

Vijay devarakonda | కెరీర్ మొదలు పెట్టిన తర్వాత భారీ గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు విజయ్ దేవరకొండ.. కానీ డియర్ కామ్రెడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచిన తర్వాత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. 2020లో విడుదలైన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. అర్జున్ రెడ్డి విడుదలైన ఆగస్టు 25న సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జోరు మామూలుగా లేదు ఏకంగా అరడజను సినిమాలు లైన్లో పెట్టాడు. ఆ ఆరు సినిమాల్లో ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమాలు ఉండటం గమనార్హం.
ఇప్పటికే సుకుమార్ – విజయ్ దేవరకొండ సినిమాపై క్లారిటీ వచ్చింది. 2023లో ఇది మొదలు కానుంది. పుష్ప 2 పూర్తయిన వెంటనే విజయ్ సినిమా మొదలు పెట్టనున్నాడు లెక్కల మాస్టారు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా చేయబోతుంది. ఇక పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చివరికి విజయ్ దేవరకొండతోనే చేయాలని ఫిక్స్ అయినట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ కూడా ఎప్పుడో విజయ్ దేవరకొండకు కమిట్మెంట్ ఇచ్చాడు. కచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావడం పక్కా. బహుశా జూనియర్ ఎన్టీఆర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతోనే కొరటాల సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు రెగ్యులర్గా టచ్లో ఉన్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లైనప్ అంతా చూస్తుంటే విజయ్ దేవరకొండ ఎంతటి దేశ ముదురు అనేది అర్థమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Janaganamana | మహేశ్ కాదన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
Vijay devarakonda | లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఇవే..
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

