Janaganamana | మహేశ్ కాదన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Janaganamana movie | డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ చిత్రంతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్ జోహార్‌తో కలిసి తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు పూరీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతోనే మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు పూరీ జగన్నాథ్. లైగర్ సినిమా షూటింగ్ సమయంలో పూరీ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

పోకిరి, బిజినెస్మెన్ సినిమాల తర్వాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని అనుకున్నాడు పూరీ జగన్నాథ్. దీనికోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసం జనగణమణ టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. మహేశ్‌బాబుతో జనగణమణ తీస్తున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ సినిమా ఎందుకనో పట్టాలెక్కలేదు. అయితే పూరీ రెడీ చేసిన కథ అంతగా నచ్చకపోవడంతోనే మహేశ్ ఈ సినిమా చేసేందుకు ముందుకురాలేదని.. అందుకే ఈ కాంబోలో హ్యాట్రిక్ మిస్సయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఎప్పటికైనా ఈ సినిమా పట్టాలెక్కుతుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. లైగర్ సినిమా సమయంలో విజయ్ దేవరకొండకు నెరేట్ చేసింది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమణ స్క్రిప్ట్ అని తెలుస్తోంది. మహేశ్ నుంచి సమాధానం రాకపోవడంతో విజయ్ దేవరకొండకు ఈ స్క్రిప్ట్ చెప్పాడని.. కథ నచ్చడంతో విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.
ఇక లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుంది. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముంబైలోని ఒక ఛాయ్‌వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Vijay devarakonda | లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు ఇవే..
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా?
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
లైగర్ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే పూరీతో విజయ్ దేవరకొండ వన్స్ మోర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

