ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రిచెస్ట్ యాక్టర్లల్లో ఒకరు కోలీవుడ్ (Kollywood)స్టార్ హీరో విజయ్ (Vijay). ఈ స్టార్ హీరోకు ఇండియావైడ్‌గా అభిమానులున్నారు. తాజాగా విజయ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. విజయ్ చెన్నైలో ఖరీదైన అపార్టుమెంట్‌ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్ (East Coast road)లో ఉంటున్నాడు.
లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ రోడ్లో ట్రాఫిక్ సమస్యలుండటంతో కొత్త ఇంటికి మారాలనే నిర్ణయం తీసుకున్నాడట. రూ.35 కోట్లు పెట్టి కొత్త లగ్జరీ అపార్టుమెంట్ కొనుగోలు చేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు విజయ్ ఇదే ఇంట్లోకి తన ఆఫీస్‌ను కూడా షిఫ్ట్ చేశాడని కోలీవుడ్ సర్కిల్ టాక్. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన ఆర్య ఇదే బిల్డింగ్‌లో అపార్టుమెంట్‌ను కొనుక్కున్నాడట.
విజయ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) దర్శకత్వంలో వారసుడు సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో వారిసు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ