Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.ఈ మూవీ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. సూర్య టీం ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో బిజీగా ఉంది.
చాలా గొప్పగా, థ్రిల్లింగ్‌గా ఉంది. కంగువ అన్ని భాషల కాపీలు లాక్ చేయబడ్డాయి. లోడింగ్.. అంటూ పాపులర్ సినిమాటోగ్రఫర్ వెట్రివేల్ పళనిసామి ట్వీట్ చేస్తూ.. శివ టీంతో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు న్టెటింట వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
కంగువ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్ , సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars రిలీజ్ చేస్తున్నాయి.
எம்பெருமான் முருகன் திருவருளால்🙏🙏
Feeling so grateful and thrilled! #Kanguva all language copies Locked & Loaded!🔥🔥🔥🗡️🗡️
Can’t wait for you all to experience it@Suriya_offl @directorsiva @ThisIsDSP @kegvraja @colourvirtuoso @iGeneDIandVFX @rays3d #KanguvaFomNov14 pic.twitter.com/pjjWS8OCUE
— Vetrivel Palanisamy (@vetrivisuals) November 12, 2024
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?