టాలీవుడ్ హీరో రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రామారావు..ఆన్ డ్యూటీ. శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వేణు ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో నటించబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
తనదైన కామిక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో అలరించడం వేణుకు వెన్నతో పెట్టిన విద్య. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, పెళ్లాం ఊరెళితే.. గోపి గోపిక గోదావరి వంటి సినిమాల్లో వేణు చేసిన కామెడీ చూస్తే ఇప్పటికీ పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వేణు.. ఇప్పుడు రవితేజ సినిమాతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నాడు. 2013లో చివరిసారిగా రామాచారి సినిమా చేశాడు వేణు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘రామారావు’తో కలిసి సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
వేణు పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంటుందని భావిస్తున్నారు సినీ లవర్స్. సుధాకర్ నిర్మిస్తోన్న చెరుకూరి ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది.
Team #RamaRaoOnDuty takes privilege in welcoming back everyone's favorite #VenuThottempudi garu to be ON DUTY again to flare the screen.@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @sahisuresh @SamCSmusic @SLVCinemasOffl @RTTeamWorks pic.twitter.com/uDheCIi9bI
— BA Raju's Team (@baraju_SuperHit) July 29, 2021
ఇవి కూడా చదవండి..
మా స్టోరీస్ మావే..రైటర్స్ గా యంగ్ హీరోలు
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..