ఈ రోజుల్లో కథలు రాయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎలాంటి కథ రాసినా కూడా రొటీన్ అంటూ పెదవి విరుస్తుంటారు విశ్లేషకులు. అయినా కూడా అందులోనూ కొందరు రైటర్స్ కొత్త కథలు రాయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం రైటర్స్ మాత్రమే కాదు.. కొందరు హీరోలు కూడా రచయితలు అవుతున్నారు. ముఖ్యంగా తమ సినిమాలకు తామే కథలు రాసుకుంటున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న కుర్ర హీరోలు మరో రైటర్‌పై ఆధారపడటం లేదు.
ఫలక్ నుమా దాస్ సినిమా వేడుకలో విశ్వక్ సేన్ నన్ను నేనే లేపుకుంటా అని చెప్పినట్లు.. హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. తమ కోసం ఎవరో వచ్చి తమకు బ్రేక్ ఇస్తారనే నమ్మకం వాళ్లు పెట్టుకోవడం లేదు. తమ కథలు తామే రాసుకుని.. కుదిర్తే మాటలు, స్క్రీన్ ప్లే కూడా వాళ్ళే రాసుకుంటున్నారు. దర్శకత్వ బాధ్యత మాత్రం మరొకరికి ఇస్తున్నారు. తెలుగులో నవీన్ పొలిశెట్టి, అడవి శేష్, సిద్ధు, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా రైటింగ్లోనూ సత్తా చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..