గ్రామీణ నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కిన నారప్ప ( Narappa) చిత్రం మంచి టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది. వెంకటేశ్ (Venkatesh) , ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, చైల్డ్ యాక్టర్ గీతాకృష్ణ తమ పాత్రల్లో జీవించేశారు. ఇక పొలాల మధ్యలో, కొండలు, కోనలు, అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేసింది శ్రీకాంత్ అడ్డాల అండ్ టీం. సినిమా చాలా రియలిస్టిక్ గా ఉండేలా చిత్రయూనిట్ కష్టతర ప్రాంతాలకు వెళ్లి చిత్రీకరణ జరిపింది.
అయితే సినిమా కోసం నారప్ప టీం పడ్డ కష్టాలను తెలుపుతూ షూట్ వీడియో ఒకటి ట్విటర్ ద్వారా షేర్ చేశాడు వెంకటేశ్. నారప్పలో కొన్ని సీన్ల చిత్రీకరణ మాకు చాలా ఛాలెంజ్ తో కూడుకున్నది. చిత్రీకరణను సులభంగా జరిపేందుకు అద్బుతమైన బృందం చాలా కష్టపడుతూ మాతో కలిసి పనిచేసింది. కొన్ని అందమైన, కష్టతరమైన లొకేషన్లలో షూటింగ్ చేయడంతో నారప్ప మరింత స్పెషల్ గా మారింది.
సినిమా బృందం షూటింగ్ సామాగ్రిని మోసుకుంటూ కొండలెక్కుతూ, నీటిలో తడుస్తూ కష్టాలు పడ్డ వీడియోను వెంకీ షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ కు రీమేక్ గా తెరకెక్కింది నారప్ప.
Shooting some of the scenes from #Narappa was very challenging for us. It's always wonderful to have a team that puts in extra effort to make the process go smoothly. Here’s a sneak peek of some of the locations that made our film even more special. Watch #NarappaOnPrime now ! pic.twitter.com/MhCwn0kX37
— Venkatesh Daggubati (@VenkyMama) August 3, 2021
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో