F 3 Trailer | మోస్ట్ అవైటెడ్ సినిమా ఎఫ్ 3 ట్రైలర్ వచ్చేసింది. మే 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు అలాగే ఉన్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. సునీల్ ఈ సీక్వెల్లో కీలక పాత్రలో నటించాడు. సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్. ట్రైలర్ చూస్తుంటే మరోసారి నవ్వుల జర్నీ కన్ఫర్మ్ అని అర్థమైపోతుంది. పైగా సీక్వెల్లో మరిన్ని విషయాలు కూడా యాడ్ చేశాడు అనిల్ రావిపూడి. మరీ ముఖ్యంగా వెంకటేశ్‌కు రేచీకటి పెట్టాడు.. అది చూసిన తర్వాత సినిమాలో ఫన్ మరో స్థాయిలో ఉంటుందని అర్థమవుతుంది. ఇక వరుణ్ తేజ్‌కు నత్తి పెట్టాడు.
ఈ రెండు అదిరిపోయేలా వర్కవుట్ చేశాడు అనిల్ రావిపూడి. వీటితోనే కావాల్సినంత ఫన్ జనరేట్ చేశాడు అనిల్ రావిపూడి. తమన్నా, మెహ్రీన్ పాత్రలను మరింత ఫన్నీగా డిజైన్ చేశాడు. సునీల్ యాడ్ అయిన తర్వాత సినిమాలో కామెడీ డోస్ మరింత పెరగడం ఖాయం. దిల్ రాజు ఈ సినిమాను 70 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. మధ్యలో దగ్గుబాటి ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీ అంటూ డైలాగులు కూడా చెప్పించాడు అనిల్.
ఫ్యాన్స్ కు ఇవి ట్రీట్ ఇవ్వనున్నాయి. మరోవైపు చివర్లో అంతేగా అంతేగా అంటూ ముగించేశాడు. ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మీద వెళ్తే.. ఈ సారి మాత్రం డబ్బును యాడ్ చేసి దానికి కాస్త లోపాలు కూడా పెట్టాడు. హీరోలకు లోపాలుంటే సినిమాలు విజయం సాధిస్తాయనే నమ్మకం చాలా రోజులుగా ఉంది. దాన్ని బాగానే వాడుకున్నాడు అనిల్. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి.
Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి”
Anil Ravipudi | బాలకృష్ణ మూవీ మల్టీస్టారరా..? అనిల్ రావిపూడి క్లారిటీ”
“బాలయ్య సినిమాతో పూనకాలు ఖాయం.. హామీ ఇచ్చిన అనిల్ రావిపూడి..”
Anil Ravipudi About F3| ఎఫ్ 3 కొనసాగింపుగా ఉండదు: అనిల్ రావిపూడి”