Anil Ravipudi About F3| ఎఫ్ 3 కొనసాగింపుగా ఉండదు: అనిల్ రావిపూడి
టాలీవుడ్ లో వస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఎఫ్ 3 (F3). వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ఫిర్జాదా హీరోహీరోయిన్లు గా నటిస్తోన్న ఈ చిత్రం ఎఫ్ 2కు కొనసాగింపు కాదని సినిమాతో అనిల్ రావిపూడి (Anil Ravipudi) క్లారిటీ ఇచ్చాడు.

టాలీవుడ్ లో వస్తోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఎఫ్ 3 (F3). వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ఫిర్జాదా హీరోహీరోయిన్లు గా నటిస్తున్నారు. ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఎఫ్ 3తో మరోసారి వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎఫ్ 2కు కంటిన్యూగా ఉంటుందని అంతా అనుకుంటుండగా..దీనిపై క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 కు కొనసాగింపుగా ఎఫ్ 3 ఉండబోదని, అయితే ఆ మూవీ ఫ్లేవర్ టచ్ మాత్రం ఉంటుందని స్పష్టం చేశాడు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..నా ప్రతీ సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకుంటా. ఇదే నన్ను చాలా కష్టపడేలా చేస్తుంది. రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేవరు నీకెవ్వరు చిత్రాలను అదే రూటులో తెరకెక్కించాను. ఎఫ్ 3 సినిమాపై అంచనాలున్నాయని ఒప్పుకుంటాను. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఎఫ్ 2కు కొనసాగింపుగా ఉండదు. అయితే ఎఫ్ 2లోని ఫన్ , ఫ్రస్టేషన్ ఎఫ్ 3లోనూ ఉంటాయి. ఎఫ్ 2 వివాహ సంబంధాలను గురించి చెబితే..ఎఫ్ 3 మాత్రం ఫ్యామిలీలో డబ్బు వ్యవహారాల చుట్టూ తిరుగుతుందని చెప్పాడు. ఎఫ్ 3 కథనం కొత్తగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ రేచీకటి ఉన్న వ్యక్తిగా కనిపించి పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. మరో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీ రోల్ చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

