Anil Ravipudi | బాలకృష్ణ మూవీ మల్టీస్టారరా..? అనిల్ రావిపూడి క్లారిటీ
అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఎఫ్ 3 చిత్రం మేలో థియేటర్లలో సందడి చేయనుంది. ఎఫ్2కు కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ 3 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రస్తుతం హీరోలు వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej)తో ఎఫ్ 3 చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం మేలో థియేటర్లలో సందడి చేయనుంది. ఎఫ్2 ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో..కొనసాగింపుగా వస్తున్న ఎఫ్ 3 సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఏదో ఒక క్రేజీ గాసిప్ తెరపైకి వస్తూనే ఉంది. బాలకృష్ణ (Balakrishna)తో చేయబోయే సినిమా మల్టీ స్టారర్ అని వార్తలు వస్తుండగా..దీనిపై క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
‘నేను ప్రస్తుతం ఎఫ్ 3 మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నా. బాలకృష్ణ సినిమా కోసం కథ ఇప్పటికే రెడీ అయింది. ఇది సింగిల్ హీరో సినిమా. ఎఫ్ విడుదల తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం. నేను ప్రస్తుతం పూర్తిగా ఎఫ్ 3 సినిమాపైనే పనిచేస్తున్నానని’ చెప్పాడు. ఎఫ్ 3 మే 27న విడుదల కానుంది. ఈ వేసవిలో ఫ్యామిలీస్, క్లాస్, మాస్ ఆడియెన్స్ కు కంప్లీట్ లాఫింగ్ థెరపీని అందించబోతుందని ధీమాగా చెప్తోంది అనిల్ రావిపూడి టీం. ఎఫ్ 3 షూటింగ్ చివరి దశలో ఉంది.
Read Also : Hari Hara Veera Mallu Action | హరిహర వీరమల్లు ఎంతమందితో ఫైట్ చేస్తున్నాడో తెలుసా..?
బాలకృష్ణ మరోవైపు క్రాక్ సినిమాతో మంచి ఫాంలోకి వచ్చిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 107 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తన ప్రతీ సినిమాలో శృతిహాసన్ ఉండేలా చూసుకుంటూ..సక్సెస్ ఖాతాలో వేసుకుంటున్నా గోపీచంద్ మలినేనికి బాలకృష్ణ సినిమా ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.
Read Also : Bloody Mery | ‘కాలానికి విపరీతమైన మెమోరీ పవర్ ఉంటుంది’.. ఆకట్టుకుంటున్న బ్లడీ మేరీ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

