బాలయ్య సినిమాతో పూనకాలు ఖాయం.. హామీ ఇచ్చిన అనిల్ రావిపూడి..
Anil Ravipudi and Balakrishna | టాలీవుడ్లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్‌ను కాంబినేషన్ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారని తెలియగానే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అఖండతో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చిన హీరో బాలకృష్ణ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ స్ట్రీక్‌లో ఉన్నాడు ఈయన. వరసగా ఐదు విజయాలు అందుకున్నాడు. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఈయన దూసుకుపోతున్నాడు. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు కూడా సరిలేరు నీకు అన్నట్లు రచ్చ చేశాడు అనిల్ రావిపూడి. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈయన ఊ అనాలే కానీ చాలా మంది నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు.
అనిల్ సినిమా అంటే ఇప్పుడు 100 కోట్లు ఖాయం అనే నమ్మకం కూడా వచ్చేసింది నిర్మాతల్లో. సేఫ్ సినిమాలు చేస్తాడనే పేరు కూడా ఉండటంతో అతడి సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కంటిన్యూ అవుతున్నారు. వాళ్లతో పాటు సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడి సినిమా ఎవరితో ఉండబోతుందనే అనుమానాలకు ఈ మధ్యే తెరదించాడు అనిల్. బాలయ్యతో అనిల్ రావిపూడి తర్వాతి సినిమా ఉండబోతుంది. చాలా ఏళ్లుగా ఈ కాంబినేషన్‌పై వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆయన 100వ సినిమాను అనిల్ చేయాల్సి ఉన్నా అనుకోకుండా ఆగిపోయింది. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా బాలయ్యతో అవకాశం కోసం చూస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు.
బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉండబోతుంది. నాగ చైతన్య, సమంత మజిలీ సినిమాను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బాలయ్య సినిమాను దాదాపు 70 కోట్లతో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. జూలై, ఆగస్టులో బాలయ్య సినిమా మొదలు పెట్టబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో అభిమానులకు పూనకాలు ఖాయమంటున్నాడు ఈయన. బాలయ్య తనను పూర్తిగా నమ్మాడని.. దాని అవుట్‌పుట్ చూపిస్తానని అంటున్నాడు అనిల్ రావిపూడి. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఈ సినిమా సాగనుంది. మరి ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

