టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ వరుడు కావలెను, స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న లక్ష్య, కాప్ డ్రామా పోలీస్ వారి హెచ్చరికతోపాటు మరో సినిమా ఈ యంగ్ హీరో ఖాతాలో ఉన్నాయి. నాగశౌర్య తన డైలీ షెడ్యూల్ ను చూసుకునేందుకు పర్సనల్ మేనేజర్ గా ఎస్ వెంకటరత్నం (వెంకట్) ను అపాయింట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు నాగశౌర్య.
వెంకట్ ఇప్పటికే నాని, నితిన్ కు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. వెంకట్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడమే కాకుండా నాని, నితిన్ నిర్మిస్తున్న పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు. నా ఒత్తిడిని అధికారికంగా మీకు బదిలీ చేస్తున్నా..వెంకట్, వెల్ కమ్ అంటూ అతనితో డిస్కషన్ చేస్తుండగా దిగిన స్టిల్ ను ట్విటర్ లో పోస్ట్ చేశాడు.
లక్ష్య సినిమా కోసం జిమ్ లో చాలానే కసరత్తులు చేశాడు నాగశౌర్య. ఓ వైపు క్లాస్ రోల్స్, మరోవైపు మాస్ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ కు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు.
Officially transferring all my stress to you, @SVR4446 (Venkat) garu.
— Naga Shaurya (@IamNagashaurya) July 23, 2021
Welcome Aboard ☺️🤗 pic.twitter.com/mnz3V3tVN2
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?